pushpa2: ఈ థియేటర్లో పుష్ప-2 టికెట్ రూ.3 వేలు... కారణం ఏంటంటే...!

pushpa2 priced at rs3000 at pvr most luxurious maison jio world drive
  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప – 2: ది రూల్
  • డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ
  • ముంబయిలోని ఓ థియేటర్‌లో టికెట్ ధర రూ.3వేలు 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప – 2: ది రూల్ మూవీ ఈ నెల 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సాధారణంగా బెనిఫిట్ షోలకు థియేటర్ వద్ద అమ్ముడయ్యే టికెట్ ధరతో పోలిస్తే, రెండు మూడు రెట్లు ఎక్కువగా తీసుకుంటారు. 

ఫ్యాన్స్ షోలకూ టికెట్ ధర కొన్ని సార్లు రూ.2వేల వరకూ ఉంటుంది. అయితే పుష్ప -2 మూవీ టికెట్ ధరలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే .. ముంబయిలోని ఓ థియేటర్‌లో ఏకంగా రూ.3వేలకు టికెట్‌ను విక్రయిస్తున్నారు. ఈ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 
 
ముంబయి జియో వరల్డ్‌ డ్రైవ్‌లో ఉన్న పీవీఆర్ మైసన్‌లో టికెట్ ధర రూ.3వేలు చూపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ థియేటర్‌లో టికెట్ ధర అంత పెట్టడానికి కారణం ఏమిటంటే.. జియో వరల్డ్ డ్రైవ్‌లోని సినిమాస్ పూర్తి లగ్జరీ వాతావరణంలో ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుగా స్క్రీన్‌ను బట్టి ఓపస్ గ్రైడ్ రెక్లయినింగ్ సీట్లను అమర్చారు. రూ.3వేల టికెట్ ధర ఉన్న స్క్రీన్‌లో మాత్రం వెరోనా జీరో వాల్ సీట్లు అమర్చారు. 

ఇవి అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రేక్షకుల కోరిక మేరకు ఒక బటన్ నొక్కితే కోరిన ఫుడ్‌ను సర్వ్ చేస్తారు. తినుబండారాలు కిందపడకుండా ఉండేందుకు సీట్లకు అనువైన లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. తమకు కావాల్సిన మేరకు సీట్‌లను జరుపుకునే అవకాశం ఉంటుంది. రెండు సీట్ల మధ్య అతి తక్కువ కాంతి ఉండే లైట్లు కూడా అమర్చి ఉంటాయి. సీట్లకు అమర్చిన సెన్సార్ల కారణంగా ప్రేక్షకుడు అందులో నుంచి లేచిన వెంటనే అవి యథాస్థితికి వచ్చేస్తాయి.     
pushpa2
Movie News
Allu Arjun
jio world drive

More Telugu News