Transgender Hasini Murder: నెల్లూరు హిజ్రా హాసిని హత్య కేసును ఛేదించిన పోలీసులు

Nellore police busted transgender Hasini murder case
  • నవంబరు 26న నెల్లూరు జిల్లాలో హిజ్రా హాసిని హత్య
  • కత్తులతో నరికి చంపిన దుండగులు
  • ఆధిపత్య పోరే కారణమన్న ఎస్పీ కృష్ణకాంత్
  • ఇతర హిజ్రాలు సుపారీ ఇచ్చి చంపించారని వెల్లడి
నెల్లూరు జిల్లాలో ఇటీవల హత్యకు గురైన ట్రాన్స్ జెండర్ హాసిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మీడియాకు వివరాలు తెలిపారు. హిజ్రాల మధ్య ఆధిపత్య పోరే హాసిని హత్యకు కారణమని వెల్లడించారు. హిజ్రాలు అలేఖ్య, షీలా సుపారీ ఇచ్చి హాసినిని చంపించారని వివరించారు. 

ఇప్పటివరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ హత్య జరిగినప్పటి నుంచి మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్ హాసినిని నవంబరు 26న దుండగులు కత్తులతో నరికి చంపారు.
Transgender Hasini Murder
Nellore
Police

More Telugu News