Maharashtra: మహారాష్ట్రలో బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... 9 మంది మృతి

9 killed as bus trying to avoid hitting bike overturns in Maharashtra
  • గోండియా జిల్లాలో ప్రమాద ఘటన
  • భండారి నుంచి గోండియా వెళ్తున్న బస్సు బోల్తా
  • పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా పడటంతో 9 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని గోండియా జిల్లాలో చోటు చేసుకుంది. భండారి నుంచి గోండియా వెళుతున్న బస్సుకు కోహ్‌మారా హైవే వద్ద ఎదురుగా బైక్ వచ్చింది.

ఈ బైక్‌ను తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును మరోవైపుకు తిప్పాడు. దీంతో బస్సు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బోస్సు బోల్తా పడిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంపై బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దురదృష్టకరమన్నారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించాలని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే అధికారులు, వైద్యులు సంఘటన స్థలానికి వెళ్లారు.
Maharashtra
Road Accident
Bus Accident

More Telugu News