Mallika Sherawat: ఇప్పుడు నేను సింగిల్ గానే ఉన్నా: మల్లికా శెరావత్

Now I am single says Mallika Sherawat
  • గతంలో ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానన్న మల్లిక
  • ఆ రిలేషన్ బ్రేక్ అయిందని వెల్లడి
  • మంచి వ్యక్తిని భర్తగా పొందడం కష్టమని వ్యాఖ్య
మల్లికా శెరావత్... ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ ను ఒకానొకప్పుడు షేక్ చేసిన హీరోయిన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. 

గతంలో తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని... ఆ రిలేషన్ షిప్ బ్రేక్ అయిందని మల్లిక తెలిపారు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉంటున్నానని వెల్లడించారు. పెళ్లిపై తనకు భిన్నాభిప్రాయాలున్నాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వ్యక్తిని భర్తగా పొందడం కష్టమేనని చెప్పారు. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటానని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటానని తెలిపారు. మంచి భోజనం తింటానని, సమయానికి నిద్రపోతానని చెప్పారు. 

'ది రాయల్స్' సిరీస్ లో ఇషాన్ కట్టర్ తల్లి పాత్రలో తాను నటించాల్సి ఉందని... అయితే తొలుత తనకు చెప్పిన కథకి, ఫైనల్ స్క్రిప్ట్ కి సంబంధం లేకపోవడంతో... ఆ అవకాశాన్ని తిర్కరించానని మల్లిక తెలిపారు. 


Mallika Sherawat
Tollywood
Bollywood
Relation

More Telugu News