BCCI: ఆసీస్ ప్ర‌ధానితో టీమిండియా ప్లేయ‌ర్ల భేటీ.. వీడియో విడుద‌ల చేసిన బీసీసీఐ

The Indian Cricket Team was hosted by the Honourable PM Anthony Albanese
  • గురువారం ఆసీస్ ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్‌ను క‌లిసిన భార‌త క్రికెట‌ర్లు
  • భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఆసీస్‌ ప్ర‌ధాని ఆతిథ్యం ఇచ్చారంటూ బీసీసీఐ ట్వీట్‌
  • రేపటి నుంచి కాన్‌బెర్రా వేదిక‌గా ప్రైమ్ మినిస్ట‌ర్ ఎలెవ‌న్‌తో భార‌త జ‌ట్టు వార్మ‌ప్ మ్యాచ్
ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్‌ను గురువారం టీమిండియా క్రికెట‌ర్లు క‌లిసిన‌ విష‌యం తెలిసిందే. ఆసీస్‌తో జ‌రిగే రెండో టెస్టు కోసం భార‌త జ‌ట్టు కాన్‌బెర్రాకి చేరుకుని అక్క‌డి పార్ల‌మెంట్‌లో ప్ర‌ధానిని క‌లుసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా విడుద‌ల చేసింది. 

భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి ఆతిథ్యం ఇచ్చార‌ని పేర్కొంది. ఆంథోనీ అల్బ‌నీస్‌తో టీమిండియా ఆట‌గాళ్లు ముచ్చ‌టించ‌డం, వారిని ఆయ‌న అభినందించ‌డాన్ని వీడియోలో చూపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు, విరాట్ కోహ్లీకి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ న‌డిచింది. బీసీసీఐ తాజాగా షేర్ చేసిన ప్ర‌స్తుతం వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

కాగా, శ‌నివారం నుంచి కాన్‌బెర్రా వేదిక‌గా ప్రైమ్ మినిస్ట‌ర్ ఎలెవ‌న్‌తో భార‌త జ‌ట్టు వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది. ఈ క్ర‌మంలోనే టీమిండియా ప్లేయ‌ర్లు ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్‌తో స‌మావేశ‌మ‌య్యారు. అలాగే భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆ దేశ పార్ల‌మెంట్‌లో కూడా ప్ర‌సంగించారు. 
BCCI
Team India
Anthony Albanese
Australia
Sports News

More Telugu News