Pushpa2: 'పుష్ప -2' చిత్రానికి సెన్సారు ఇచ్చిన కట్స్‌ ఏమిటో తెలుసా?

Do you know the cuts given by the censors for the film Pushpa 2
  • సెన్సారు పూర్తి చేసుకున్న 'పుష్ప-2' 
  • ఐదు కట్‌లను సూచించిన సెన్పారు బోర్డు 
  • యు బై ఏ సర్టిఫికెట్‌ను పొందిన 'పుష్ప-2' 
  • 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి 
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా 'పుష్ప-2 ది రూల్‌'  గురించే చర్చ జరుగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఇక ఇటీవల బీహార్‌లోని పాట్నాలో విడుదలైన ట్రైలర్‌ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు లక్షల మంది అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్‌ విడుదలైంది. అంతేకాదు ట్రైలర్‌ కూడా ఎంతో మాసివ్‌గా, అందర్ని అలరించే విధంగా ఉండటంతో అందరి దృష్టి 'పుష్ప-2' పై మరింత పెరిగింది. డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బుధవారం సెన్సారును పూర్తి చేసుకుంది. సెన్సారు సభ్యులు ఈ సినిమాకు యూ బై ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. 

కాగా సెన్సారు కొన్ని కట్‌లను, మ్యూట్‌లను కూడా సూచించింది. సినిమా మొత్తం మూడు గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉంది. సెన్సారు బోర్డు ఈ సినిమాకు ఐదు విషయాల్లో మార్పులు చేయమని కోరింది. 'రండి' అనే పదం స్థానంలో మరొక పదం చేర్చగా, మరో అభ్యంతరకర పదాన్ని మ్యూట్‌ చేయమని సూచించింది. 

దీంతో పాటు వెంకటేశ్వర్‌ అనే మాటను  భగవంతుడుగా మార్చమని చెప్పింది. ప్రతి నాయకుడి కాలును హీరో నరకగా, అది గాలిలో ఎగిరే సన్నివేశంతో పాటు నరికిన చేతిని హీరో అందుకునే సన్నివేశాలను సీజీతో కవర్‌ చేయమని కోరింది. ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, రావు రమేశ్, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 


Pushpa2
Allu Arjun
Sukumar
Pushpa-2
Pushpa2 The Rule
Rashmika Mandanna
Pushpa2 censor

More Telugu News