Raghu Rama Krishna Raju: సునీల్ కుమార్ తన ప్రైవేటు సిబ్బందితో నాపై దాడి చేయించాడు: రఘురామకృష్ణరాజు

Raghurama Krishna Raju allegations on ex cid chief sunil kumar
  • త్వరలో ఆ వివరాలు కూడా బయటకు వస్తాయని వ్యాఖ్య
  • సునీల్ కుమార్ దేశం విడిచి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
  • విజయ్ పాల్ తనను అక్రమంగా అరెస్ట్ చేసి దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం
వైసీపీ హయాంలో అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన ప్రైవేటు సిబ్బందితో తనపై దాడి చేయించాడని... త్వరలో ఆ వివరాలు కూడా బయటకు వస్తాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. సునీల్ కుమార్ రాష్ట్రం, దేశం విడిచి వెళ్లకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయ్ పాల్ తనను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారన్నారు.

తనపై దాడి చేసిన అధికారులు అరెస్టయ్యారని, త్వరలో మరికొందరు అరెస్టవుతారని జోస్యం చెప్పారు. కోర్టులో వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ విచారణ పారదర్శకంగా సాగుతోందన్నారు.
Raghu Rama Krishna Raju
Andhra Pradesh
Telugudesam

More Telugu News