pushpa 2: 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్...?

pawan kalyan as chief guest to pushpa 2 the rule event
  • అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్
  • డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న చిత్రం
  • డిసెంబర్ 4న రాజమండ్రిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌
  • ముఖ్య అతిధిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హజరుకానున్నారంటూ ప్రచారం
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప -2: ది రూల్ మూవీ డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పలు ప్రముఖ నగరాల్లో చిత్ర బృందం వేడుకలు నిర్వహిస్తోంది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా డిసెంబర్ 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు నిర్మాణ సంస్థ రెడీ అవుతోందని సమాచారం. 

ఇదే క్రమంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. కొంత కాలంగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడిచిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా పవన్ కల్యాణ్ హాజరవుతున్నారనే వార్త చర్చనీయాంశం అవుతోంది. ఇదే నిజమైతే అభిమానులకు పండగేనని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహాద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనుంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీ తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 
pushpa 2
Pawan Kalyan
Movie News

More Telugu News