Urvashi Rautela: టీమిండియా విజయం తర్వాత నటి ఊర్వశీ రౌతేలా పోస్ట్.. రిషభ్‌పంత్‌తో ప్రేమాయణంపై మళ్లీ ఊహాగానాలు

Urvashi Rautela Cryptic Post sparks fresh Rishabh Pant link up rumors
  • ‘విక్టరీ వైబ్స్’ అంటూ ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన ఊర్వశి
  • పంత్‌ను ఉద్దేశించే ఆమె ఆ వీడియో షేర్ చేసిందంటూ నెటిజన్ల కామెంట్లు
  • గతంలోనూ వీరి ప్రేమాయణంపై ఊహాగానాలు
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా, టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్‌పంత్ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని పంత్ వివరణ ఇచ్చిన తర్వాత ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా, ఈ పుకార్లు మరోమారు తెరపైకి వచ్చాయి. కారణం ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టే కారణం.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఊర్వశి ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానికి ‘విక్టరీ వైబ్స్’ అని క్యాప్షన్ తగిలించింది. ఊర్వశి అందులో రెడ్ అవుట్‌ఫిట్ ధరించి, చేతిలో సిల్వర్ కలర్‌లో మెరిసిపోతున్న ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌తో క్యాట్‌వాక్ చేస్తూ ఆనందంగా కనిపించింది. 

ఆమె టైమింగ్ పోస్టుపై నెటిజన్లు మరోమారు స్పందించారు. పంత్‌ను ఉద్దేశించే ఆమె ఆ పోస్టు చేసిందని, ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం ఉందని కామెంట్లు పెడుతున్నారు. విక్టరీ వైబ్స్ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ నిజానికి పంత్‌ను ఉద్దేశించేనని, అతడిప్పుడు అదే స్థితిలో ఉన్నాడని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.  

2022లో ఊర్వశి-పంత్ పేర్లు హెడ్‌లైన్స్‌కు ఎక్కాయి. ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మిస్టర్ ఆర్‌పీ’ నా కోసం హోటల్ లాబీలో గంటల కొద్దీ వేచి చూశాడని పేర్కొంది. అయితే, అప్పుడు తాను బిజీగా ఉండడంతో కలవలేకపోయానని తెలిపింది. దీంతో ఆ ‘మిస్టర్ ఆర్‌పీ’ మరెవరో కాదని, రిషభ్ పంతేనని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ వార్తలను అప్పట్లో పంత్ ఖండించాడు.
Urvashi Rautela
Rishabh Pant
Team India
Bollywood

More Telugu News