Samantha: విడాకులు తీసుకున్న అమ్మాయిలకు... సెకండ్ హ్యాండ్ అనే ట్యాగ్ ఎందుకు తగిలిస్తారో?: సమంత

Samantha comments on divorce
  • తప్పు ఎవరిదైనా అమ్మయిలనే నిందిస్తారన్న సమంత
  • వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డానని వ్యాఖ్య
  • ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానన్న సమంత
ఒక జంట విడాకులు తీసుకుంటే తప్పు ఎవరిదైనా అమ్మాయిదే తప్పు అని నిందిస్తున్నారని సినీ నటి సమంత అన్నారు. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామని చెప్పారు. విడాకులు తీసుకున్న తర్వాత తనపై కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారని... వాటన్నింటినీ తట్టుకుని తాను నిలబడ్డానని తెలిపారు. 

విడాకులు తీసుకున్న అమ్మాయిలకు సెకండ్ హ్యాండ్, యూజ్డ్, ఆమె జీవితం వేస్ట్ వంటి ట్యాగ్స్ తగిలిస్తుంటారని... ఇలాంటి ట్యాగ్స్ ఎందుకు తగిలిస్తారో తనకు అర్థం కాదని సమంత అన్నారు. ఇలాంటి మాటలు ఆ అమ్మాయిని, ఆమె కుటుంబ సభ్యులను ఎంతో బాధ పెడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట సమయంలో తనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు అండగా నిలిచారని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.
Samantha
Tollywood

More Telugu News