Gautam Adani: ప్రమాణ స్వీకారం తర్వాత అదానీకి ట్రంప్ గుడ్‌న్యూస్ చెబుతారా?.. అటార్నీ ఏమన్నారంటే?

US Charges Against Adani Group Can Be Dropped After Trump Takeover Says Attorny Ravi Batra
  • అదానీపై 265 మిలియన్ డాలర్ల లంచం కేసు
  • ఈ కేసును లోపభూయిష్టమైనదిగా భావిస్తే కేసును ఉపసంహరించుకోవచ్చన్న న్యాయవాది రవి బాత్రా
  • చట్టం ఉన్నది ఒకరి ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కాదని స్పష్టీకరణ
భారత బిలియనీర్ గౌతం అదానీపై అమెరికాలో నమోదైన 265 మిలియన్ డాలర్ల లంచం కేసుపై ఇండియన్-అమెరికన్ ప్రముఖ న్యాయవాది ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును అనర్హమైనదిగా, లోపభూయిష్టమైనదిగా అభివర్ణించిన ఆయన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. 

ప్రతి కొత్త అధ్యక్షుడికి కొత్త టీం ఉంటుందని అటార్నీ రవి బాత్రా పేర్కొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విశ్వాసం లేని ఏ ప్రాసిక్యూషన్‌నైనా ఉపసంహరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. చట్టం ఉన్నది ఒకరి ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కాదని చెప్పారు. 

వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వద్ద అదానీ ఈ సమస్యను లేవనెత్తే అవకాశం ఉందని చెప్పారు.  క్రిమినల్ లేదంటే సివిల్ అభియోగాలు లోపభూయిష్టంగా ఉన్నట్టు భావిస్తే కొత్త అధ్యక్షుడు ట్రంప్ కొత్త న్యాయ విభాగం, సెక్యూరిటీ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) క్రిమినల్, సివిల్ కేసులను ఉపసంహరించుకోవచ్చని బాత్రా వివరించారు.  
Gautam Adani
Donald Trump
Bribery Case
Attorney Ravi Batra

More Telugu News