వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో టీమిండియా మళ్లీ టాప్
- ఆస్ట్రిలియాను 295 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆధిక్యంలోకి దుసుకెళ్లిన టీమిండియా
- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో 61.11 శాతంతో తొలి స్థానానికి చేరిన భారత్
- 57.69 శాతంతో రెండో స్థానంలోకి వెళ్లిన ఆసీస్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో ప్రస్తుతం భారత్ 61.11 శాతం సాధించింది. ఇప్పటి వరకు 15 టెస్టులు ఆడిన టీమిండియా తొమ్మిది మ్యాచుల్లో నెగ్గింది. ఐదింట్లో ఓటమి పాలయింది. ఒకటి డ్రాగా ముగిసింది. మొత్తం 98 పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఆసీస్ 57.69 శాతంతో కొనసాగుతోంది. మొత్తం 13 మ్యాచుల్లో 8 గెలుపొందగా, నాలుగు ఓటములను చవి చూసింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ 62.50 శాతం, భారత్ 58.33 శాతంతో తొలి రెండు స్థానాల్లో ఉండేవి. ఇప్పుడు తాజా విజయంతో తారుమారు కావడం గమనార్హం. పట్టికలో శ్రీలంక 55.56 శాతం, న్యూజిలాండ్ 54.55, దక్షిణాఫ్రికా 54.17 శాతంతో టాప్ – 5లో ఉన్నాయి.