Ram Mohan Naidu: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు శ్రీకాకుళం కుర్రాడు.. కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు విషెస్‌

Minister Ram Mohan Naidu Congratulations to Tirupurana Vijay
  • శ్రీకాకుళం జిల్లాకు చెందిన త్రిపురాన విజ‌య్‌ను కొన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌
  • బేస్ ప్రైజ్ రూ. 30ల‌క్ష‌ల‌కే విజ‌య్‌ను ద‌క్కించుకున్న ఫ్రాంచైజీ
  • విజ‌య్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర‌మంత్రి ట్వీట్
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన త్రిపురాన విజ‌య్‌ను ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంచైజీ రూ. 30 ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. ఇలా ఐపీఎల్‌లో చోటు ద‌క్కించుకోవ‌డంపై విజ‌య్‌కు కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా విజ‌య్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు చేశారు.

"శ్రీకాకుళం జిల్లా నుండి ఐపీఎల్‌కు ఎంపికయిన త్రిపురాన విజ‌య్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ కొత్త అధ్యాయంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం గర్వపడేలా కష్టపడండి" అని రామ్మోహ‌న్ నాయుడు ట్వీట్ చేశారు.
Ram Mohan Naidu
Tirupurana Vijay
Delhi Capitals
IPL 2025 Auction
Srikakulam District
Andhra Pradesh

More Telugu News