Dogs: కుక్కపిల్లలకు వేడుకగా బారసాల... వైరల్​ వీడియో ఇదిగో!

Couple who celebrated a naming ceremony for puppy pups
  • పెంపుడు శునకానికి పిల్లలు పుట్టడంతో యజమానుల్లో ఆనందం
  • పక్కా సాంప్రదాయబద్ధంగా పూర్తిస్థాయిలో బారసాల వేడుక
  • తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఘటన
తాము ముద్దుగా పెంచుకుంటున్న కుక్కకు నాలుగు పిల్లలు జన్మించడంతో... దాని యజమానులు ఘనంగా బారసాల చేశారు. కుక్కపిల్లలకు కొత్త డ్రెస్సులు తొడిగి, ఊయలలో వేసి ఊపారు. ఎక్కడా తగ్గకుండా పక్కా సాంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఈ చిత్రం చోటు చేసుకుంది.

పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాపెల్లి వినోద్, లావణ్య దంపతులు సంవత్సరం క్రితం షీడ్జూ జాతికి చెందిన కుక్కను తెచ్చుకొని పెంచుకుంటున్నారు. ఇటీవల ఆ శునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆనందపడిన ఆ దంపతులు వాటికి బారసాల వేడుక నిర్వహించారు. చుట్టుపక్కల వారిని, బంధువులను పిలిచి మరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dogs
offbeat
Viral Videos
Viral News
Telangana

More Telugu News