Lunch Date: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లంచ్ డేట్‌.. నెట్టింట ఫొటోలు వైర‌ల్!

Vijay Deverakonda and Rashmika Mandanna head out for lunch date pictures go viral
  • మ‌రోసారి కెమెరా కంటికి చిక్కిన విజ‌య్‌, ర‌ష్మిక‌
  • ఒక రెస్టారెంట్‌లో లంచ్ డేట్‌కు వెళ్లిన వైనం
  • వీరిద్ద‌రూ క‌లిసి లంచ్ చేస్తున్న‌ ఫొటోలు బ‌య‌టికి రావ‌డంతో వైర‌ల్‌
టాలీవుడ్ స్టార్ న‌టులు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ‘గీత గోవిందం’ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించారు. అప్ప‌టి నుంచి ఈ జంట త‌మ‌ పర్సనల్‌ లైఫ్‌లో చాలా సన్నిహితంగా ఉంటున్నట్టు కథనాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా విజ‌య్‌, ర‌ష్మిక‌ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ జంట మాత్రం తాము కేవలం స్నేహితులం మాత్రమేనని చెబుతూ వ‌స్తోంది. 

ఇక విజ‌య్‌ ఇటీవ‌ల‌ 'సాహిబా' అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఆల్బ‌మ్ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా రౌడీబాయ్‌ త‌న రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను సింగిల్ కాద‌న్నాడు. త‌న‌కు 35 ఏళ్లు వచ్చాయ‌ని, తాను ఇంకా సింగిల్‌గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించాడు. 


దాంతో విజ‌య్ ప్ర‌స్తుతం రష్మికతో డేటింగ్‌లో ఉన్నాడంటూ మ‌రోసారి క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే విజ‌య్, రష్మిక క‌లిసి ఒక రెస్టారెంట్‌లో లంచ్ డేట్‌కు వెళ్లి కెమెరా కంటికి చిక్కారు. వీరిద్ద‌రూ క‌లిసి లంచ్ చేస్తున్న‌ ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ ఫొటోలు చూస్తుంటే... ఈ జంట ప్ర‌స్తుతం వెకేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఇద్ద‌రి సినిమాల విష‌యానికి వ‌స్తే.. గౌత‌మ్ తిన్న‌నూరితో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఒక సినిమా చేస్తున్నారు. అటు రష్మిక మందన్న ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌తో క‌లిసి 'పుష్ప-2' సినిమాలో న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న‌ 'సికింద‌ర్' మూవీలో కూడా చేస్తోంది. 
Lunch Date
Vijay Deverakonda
Rashmika Mandanna

More Telugu News