Comedian Ali: క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌.. అక్ర‌మ నిర్మాణాల‌పై నోటీసులు!

Notices Issued to Comedian Ali over Illegal Constructions
  • వికారాబాద్ జిల్లా న‌వాబ్‌పేట్ మండ‌లం ఎక్మామిడిలోని అలీ ఫామ్‌హౌస్‌లో అక్ర‌మ నిర్మాణాలు
  • నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి శోభారాణి
  • వెంట‌నే అక్ర‌మ నిర్మాణాల‌ను నిలిపివేయాల‌ని నోటీసులు
టాలీవుడ్ హాస్య‌న‌టుడు అలీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న అక్ర‌మ నిర్మాణాల‌పై అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబ్‌పేట్ మండ‌లం ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని గ్రామ కార్య‌ద‌ర్శి శోభారాణి నోటీసులు ఇచ్చారు. అక్ర‌మ నిర్మాణాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని అందులో పేర్కొన్నారు. 

కాగా, ఈ నోటీసుల‌పై అలీ త‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ద్వారా స‌మాధానం చెప్పేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. కావాల‌నే కొంద‌రు త‌న‌పై కుట్ర‌పూరితంగా ఇలా చేస్తున్నార‌ని అలీ ఆరోపిస్తున్న‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Comedian Ali
Notices
Illegal Constructions
Telangana
Tollywood

More Telugu News