Massive Bunker: భూమి లోపల 15 అంతస్తుల బంకర్ నిర్మిస్తున్న అమెరికా.. అందులో సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్.. ఒకటేమిటి సకల సౌకర్యాలు!

15 floor underground bunker has swimming pool supermarket and much more
  • ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు
  • అణుదాడులను కూడా తట్టుకోగలిగే బంకర్ నిర్మాణం
  • కన్సాస్‌లో భూమికి 200 అడుగుల లోపల 15 అంతస్తులతో నిర్మాణం
  • ఆహారం, వినోదం సహా అన్నీ అందుబాటులో ఉండేలా నిర్మాణం
ప్రస్తుతం ప్రపంచమంతా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక కొన్ని దేశాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల ప్రజలు, సరిహద్దుల్లో నివసించే వారు బంకర్లు నిర్మించుకుంటూ ఉంటారు. బాంబులకు కూడా చెక్కుచెదరనంత దృఢంగా వీటిని నిర్మిస్తారు. ఉగ్రవాదులు ఎక్కువగా బంకర్లలోనే తలదాచుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. 

గాజాలో హమాస్ ఉగ్రవాదులు నిర్మించుకున్న భారీ సొరంగాలను ఇజ్రాయెల్ దళాలు ఇటీవల గుర్తించి వీడియోలు విడుదల చేశాయి. అయితే, ఈ బంకర్లన్నీ తాత్కాలికంగా తలదాచుకునేందుకు మాత్రమే అనువుగా ఉంటాయి. ఇటీవలి కాలంలో అణుబాంబు భయాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా నిర్మిస్తున్న ఓ భారీ బంకర్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. అయితే, ఇది పేరుకు మాత్రమే బంకర్. భూమి అడుగున 15 అంతస్తులతో నిర్మిస్తున్న ఈ బంకర్‌లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అణుదాడుల నుంచి దేశాన్ని రక్షించేలా ఈ బంకర్‌ను నిర్మిస్తున్నారు. ప్రపంచం పతనం అంచున ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకునేలా తీర్చిదిద్దుతున్నారు. 

ప్రవేశ ద్వారానికి 8 టన్నుల ఇనుప తలుపు
అత్యంత దృఢమైన ఈ బంకర్‌ను కన్సాస్‌లో నిర్మిస్తున్నారు. ఓ పొలం మధ్యలో దీని ఎంట్రీ గేటు నిర్మించారు. దీనిని ‘సర్వైవల్ కోండో’ అని పిలుస్తున్నారు. ఈ ప్రవేశ ద్వారానికి 8 టన్నుల ఇనుప తలుపు అమర్చారు. ఈ బంకర్‌ను భూమి లోపలి నగరంగానూ అనుకోవచ్చు. భూమికి 200 అడుగుల లోపల 15 అంతస్తులతో ఈ బంకర్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో మనిషి రోజువారీ జీవనానికి అవసరమైన అన్ని వసతులు ఉంటాయి. ఈ భవనంలోని కింది నుంచి నాలుగో అంతస్తులో సూపర్ మార్కెట్ ఉంటుంది. అందులో ఆహారం, పానీయాలు సహా అన్నీ లభిస్తాయి. 

స్విమ్మింగ్ పూల్, జిమ్‌, మెడికల్ యూనిట్, పెట్ పార్క్ కూడా ఉంటుంది. అలాగే, చిన్న సినిమా హాల్, మినీ బార్, లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం రూ. 25 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  
Massive Bunker
USA
Kansas
Nuclear Attacks
Bomb Attacks

More Telugu News