Chahal: దిల్ రాజు సినిమాలో హీరోయిన్ గా టీమిండియా క్రికెటర్ భార్య?

Cricketer Chahal wife acting in Tollywood movie
  • యూట్యూబర్ ధనశ్రీని పెళ్లాడిన చాహల్
  • ఆల్బమ్ సాంగ్స్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ధనశ్రీ
  • 'ఆకాశం దాటి వస్తావా' సినిమాలో ధనశ్రీ నటిస్తోందని సమాచారం
టీమిండియా స్పిన్నర్ చాహల్... ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ధనశ్రీ గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఆమె 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్నాడు.   

చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. డ్యాన్స్ నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు. డ్యాన్స్ బాగా చేసే హీరోయిన్ కావాల్సి ఉండటంతో చిత్ర యూనిట్ ధనశ్రీని సంప్రదించగా... ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. ధనశ్రీకి సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. 

పలు ఆల్బమ్ సాంగ్స్ తో ధనశ్రీ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ లో ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారని చెపుతున్నారు.
Chahal
Wife
Dhanashree
Tollywood

More Telugu News