Punjab: పంజాబ్ ఉపఎన్నికల ఫలితాలు.. నిరాశలో బీజేపీ

AAP in lead in Punjab bypolls
  • పంజాబ్ లో నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు
  • మూడు స్థానాల్లో లీడ్ లో ఉన్న ఆప్
  • అన్ని స్థానాల్లో వెనుకబడిన బీజేపీ
పంజాబ్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్నాయి. గిద్దర్బహ, డేరా బాబా నానక్, చబ్బేవాల్ నియోజకవర్గాల్లో ఆప్ లీడ్ లో ఉంది. బర్నాలా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. 

చబ్బేవాల్, గిద్దర్బహ, బర్నాలా, డేరా బాబా నానక్ నాలుగు స్థానాల్లో కూడా బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నాలుగు స్థానాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు... ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో, ఈ స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. నవంబర్ 20న ఈ స్థానాల్లో పోలింగ్ జరిగింది.
Punjab
bypolls

More Telugu News