palnadu district: పల్నాడులో విషాదం .. బావిలో స్నానానికి దిగిన ఇద్దరు శివస్వాముల మృతి

two swamys died after going to bathe in the well incident in palnadu district
  • పల్నాడు జిల్లా నడిగడ్డలో తీవ్ర విషాదం
  • బావిలో లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదం   
  • సురక్షితంగా బయటపడిన మరో శివస్వామి
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బావిలో స్నానాలకు దిగిన ఇద్దరు శివ మాలధారులు మృతి చెందారు. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన ముగ్గురు శివ స్వాములు స్నానం చేయడం కోసం దిగుడు బావిలోకి దిగారు. బావిలో లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో జిడ్డు మల్లికార్జున (22), కామసాని రామకృష్ణ (27) ఉన్నారు. మరో స్వామి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. పది మోటారు ఇంజన్ల సహాయంతో బావిలో నీరు బయటకు తోడుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
palnadu district
two persons died
Crime News

More Telugu News