Rahul Gandhi: రాహుల్ గాంధీ, ఖర్గేకు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు

BJP Vinod Tawde sends legal notice to Kharge and Rahul Gandhi
  • 'మహా' ఎన్నికలకు ముందు డబ్బులు పంచినట్లు బీజేపీ నేతలపై ఆరోపణ
  • వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ
  • అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత నోటీసులు
  • 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు. తన క్లయింట్‌పై వారు తప్పుడు ఆరోపణలు చేశారంటూ వినోద్ తరపు న్యాయవాది ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. 

ఈ నోటీసులు అందిన 24 గంటల్లో కాంగ్రెస్ నేతలు తన క్లయింట్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు ఆంగ్ల, మూడు ప్రాంతీయ భాషా పత్రికల్లో మొదటి పేజీలో బహిరంగ క్షమాపణ కోరుతూ ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు అధికార, విపక్షాల మధ్య హైడ్రామా నడిచింది. పాల్‌ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని బహుజన్ వికాస్ అఘాడి పార్టీ ఆరోపించింది. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని వినోద్ తావ్డే, ఇతర బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నట్లు ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 

ఎన్నికలను ప్రభావితం చేయడానికి బీజేపీ డబ్బులు పంచుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలకు వినోద్ తావ్డే పరువు నష్టం నోటీసులు ఇచ్చారు.
Rahul Gandhi
Mallikarjun Kharge
Congress
Maharashtra
BJP

More Telugu News