Ind Vs Aus: ఆస్ట్రేలియాతో టెస్ట్.. కుప్పకూలిన ఇండియా టాప్ ఆర్డర్

India in trouble in first test with Australia
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • జైశ్వాల్, దేవదత్ డకౌట్
  • 5 పరుగులకు ఔటైన కోహ్లీ
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. జట్టు స్కోరు 5 పరుగులు ఉన్నప్పుడు జైశ్వాల్ డకౌట్ అయ్యాడు. 14 పరుగుల వద్ద దేవదత్ డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ పెవిలియన్ చేరాడు. దేవదత్, కోహ్లీ వికెట్లను హేజిల్ వుడ్ తీయగా... జైశ్వాల్ వికెట్ ను మిచెల్ స్టార్క్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు. కేఎల్ రాహుల్ (26), రిషభ్ పంత్ (3) క్రీజులో ఉన్నారు. 
Ind Vs Aus
Team India
Score

More Telugu News