AP PAC Chairman: ఏపీ పీఏసీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు!

Janasena MLA Ramanjaneyulu reportedly will be become new PAC Chairman
  • ఏపీ పీఏసీ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరం
  • బరిలో దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు
  • జనసేన నుంచి సింగిల్ గా పులపర్తి రామాంజనేయులు
  • బలం లేదని తెలిసీ వైసీపీ నుంచి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి 
ఏపీ పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ గా ఎవరు? అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పీఏసీ చైర్మన్ గా ఎన్నికవడం లాంఛనమేనని తెలుస్తోంది. 

పీఏసీ చైర్మన్ పదవికి టీడీపీ తరఫున శ్రీరాం రాజగోపాల్ (జగ్గయ్యపేట ఎమ్మెల్యే), బీవీ జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు ఎమ్మెల్యే), అరిమిల్లి రాధాకృష్ణ (తణుకు ఎమ్మెల్యే), అశోక్ రెడ్డి (గిద్దలూరు ఎమ్మెల్యే), బూర్ల రామాంజనేయులు (పత్తిపాడు ఎమ్మెల్యే), నక్కా ఆనంద్ బాబు (వేమూరు ఎమ్మెల్యే), కోళ్ల లలితకుమారి (ఎస్.కోట) నామినేషన్ దాఖలు చేయగా... జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు ఒక్కరే బరిలో దిగారు. 

బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేయగా... బలం లేదని తెలిసీ వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోవడంతో.... పీఏసీ చైర్మన్ పదవి కూటమి అభ్యర్థినే వరించనుంది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ అధికారిక ప్రకటన చేయనున్నారు.
AP PAC Chairman
Pulaparthi Ramanjaneyulu
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News