IPL 2024: సంజయ్ మంజ్రేకర్ బాబా కీ జై.. ఇన్ స్టాలో మహమ్మద్ షమీ పోస్ట్

Mohammed Shami trolls Sanjay Manjrekar after IPL auctions price drop remarks
  • ఐపీఎల్ వేలంలో షమీ ధర తగ్గుతుందని మంజ్రేకర్ జోస్యం
  • ‘బాబా కీ జై’ అంటూ షమీ సెటైర్లు
  • భవిష్యత్తు తెలుసుకోవాలంటే బాబాను కలవాలంటూ ఎద్దేవా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఈసారి మహమ్మద్ షమీపై పెద్ద మొత్తం వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు ఇష్టపడవని సంజయ్ మంజ్రేకర్ అన్నారు. షమీ తరచుగా గాయాలపాలవుతుంటాడని, ఇటీవల కూడా గాయంతో ఆటకు దూరమయ్యాడని గుర్తుచేశారు. ప్రస్తుతం కోలుకుని ఫిట్ నెస్ సాధించాడని చెబుతూనే.. అయినప్పటికీ అతడి గాయాల హిస్టరీ చూసి ఫ్రాంచైజీలు పెద్ద మొత్తం వెచ్చించేందుకు ధైర్యం చేయబోవని అన్నారు. ఫలితంగా వేలంలో అతడి ధర తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో జరిగిన ఓ చర్చలో మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. షమీని పెద్ద మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంటే ఆ జట్టుకు రిస్క్ ఎక్కువని, గాయం వల్ల అతడు జట్టుకు దూరమైతే ఆ ఫ్రాంచైజీ ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. దీనిపై టీమిండియా బౌలర్ మహమ్మద్ ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించాడు. బాబా కీ జై హో.. అంటూ ఎద్దేవా చేస్తూ, కొంత జ్ఞానాన్ని మీకోసం దాచిపెట్టుకోండి అవసరం పడొచ్చంటూ సెటైర్ వేశాడు. ఎవరికైనా తమ భవిష్యత్తు చెప్పించుకోవాలని ఉంటే దయచేసి బాబా జీని కలవాలంటూ ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు.
IPL 2024
IPL Auction
Shami
Sanjay Manjrekar
Viral Post
Instagram

More Telugu News