Patnam Narender Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

Patnam Narender Reddy gets relief in High Court
  • లగచర్ల దాడి కేసులో రిమాండ్ లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి
  • ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
  • ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి
లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనను తోటి ఖైదీలతో ఉంచకుండా... ఆయనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు... ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా అనుమతించింది. 

మరోవైపు నరేందర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయాలనే పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున... బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Patnam Narender Reddy
BRS

More Telugu News