Delhi: దేశ రాజధానిపై శశిథరూర్ కీలక వాఖ్యలు .. సోషల్ మీడియాలో వైరల్

should delhi even remain capital shashi tharoor attacks center over pollution
  • ఢిల్లీలో రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత
  • స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ – 4 ఆంక్షల అమలు
  • కేంద్రాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక పోస్టు
దేశ రాజధాని ధిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) – 4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. పొగమంచు కప్పేయడంతో గాలి నాణ్యతా సూచీ అత్యంత తీవ్రస్థాయికి పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది. 

ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా? అని నిలదీశారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ జాబితాను థరూర్ పోస్టు చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందన్నారు. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. రెండో అత్యంత కాలుష్య నగరంగా ఢాకా (బంగ్లాదేశ్ రాజధాని)తో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి ఐదు రెట్లు ఎక్కువగానే ఉందని ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నామన్నారు. 

కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవడం లేదని థరూర్ విమర్శించారు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదన్నారు. మిగతా రోజుల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలమని ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దేశ రాజధాని ఎక్కడికి మారిస్తే బాగుంటుందనే దానిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 
Delhi
Shashi Tharoor
Social Media

More Telugu News