Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన టెక్కలి ఇన్చార్జి ఫిర్యాదు

Janasena Tekkali incharge complains against YCP MLC Duvvada Srinivas
  • దువ్వాడ... పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కిరణ్ కుమార్
  • పవన్ కుటుంబంపైనా వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
  • చర్యలు తీసుకోవాలంటూ టెక్కలి పీఎస్ లో ఫిర్యాదు
దివ్వెల మాధురితో సాన్నిహిత్యం కారణంగా గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు తరచుగా మీడియాకెక్కుతోంది. తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆయనపై జనసేన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దువ్వాడ శ్రీనివాస్ గతంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీసులను కోరారు. దువ్వాడ... పవన్ కుటుంబంపైనా వ్యాఖ్యలు చేశారని కిరణ్ కుమార్ ఆరోపించారు.
Duvvada Srinivas
Kanithi Kiran Kumar
Tekkali
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News