Kasturi: సినీ నటి కస్తూరికి రిమాండ్... జైలుకు తరలింపు

Actress Kasturi sent to remand
  • తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి
  • నిన్న హైదరాబాద్ లో కస్తూరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కస్తూరికి 12 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
తమిళనాడులో నివసిస్తున్న తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె కోసం కొన్ని రోజుల పాటు గాలించిన తమిళనాడు పోలీసులు... చివరకు హైదరాబాద్ శివారులో ఓ సినీ నిర్మాత ఇంట్లో ఆమె ఉన్నట్టు గుర్తించారు. 

నిన్న మధ్యాహ్నం ఆమెను అదుపులోకి తీసుకుని తమిళనాడుకు తరలించారు. ఆమెను ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి కస్తూరికి 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో కస్తూరిని పోలీసులు పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
Kasturi
Tollywood
Kollywood
Remand

More Telugu News