Viral Videos: ప్రయాణికులను ఎత్తి లోపల పడేస్తున్న రైల్వే కూలీ.. వీడియో ఇదిగో!

Coolie Hoists Passengers Into Train Coach Through Window
 
రైల్వే స్టేషన్ లో సామాన్లు మోసుకెళ్లి ట్రైన్ లోకి ఎక్కించే కూలీలను చూసుంటారు... కానీ ఈ రైల్వే కూలీ మాత్రం లగేజీతో పాటు ప్రయాణికులనూ రైలెక్కిస్తున్నాడు. ఎక్కించడమంటే అలా ఇలా కాదు... ఎమర్జెన్సీ విండో లో నుంచి లోపలికి ఎత్తిపడేస్తున్నాడు. ద్వారం వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో రైలు ఎక్కడమెలా అని చూస్తున్న ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా లోపలికి పంపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ లో ‘హస్నా జరూరీ హై’ అనే యూజర్ కూలీ నెంబర్ 1 అంటూ శుక్రవారం ఉదయం 11 గంటలకు పోస్ట్ చేయగా... 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 21 లక్షల మంది ఈ వీడియోను చూశారు. దాదాపు పదిహేను వేల మంది యూజర్లు రీట్వీట్ చేశారు. ఇక కామెంట్లు, లైక్ లకు అయితే లెక్కేలేదు.
Viral Videos
Railway Cooli
Passengers
Emergency Window

More Telugu News