YCP: టీడీపీలో చేరిన ఎనిమిది మంది వైసీపీ సర్పంచ్ లు

YCP Sarpanch of 8 villages in West Godavari district joined TDP
--
ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వైసీపీ ఖాళీ కాగా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు సర్పంచ్ లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్ కు గుడ్ బై చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలంలో ఎనిమిది గ్రామాల సర్పంచులు తాజాగా పార్టీ మారారు. మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు.
YCP
TDP
Andhra Pradesh
West Godavari District
Sarpanch

More Telugu News