Konda Vishweshwar Reddy: కేటీఆర్‌ అరెస్ట్ కాకుండా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు.. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

BJP MP Konda Vishweshwar Reddy Sensational Comments On KTR
  • ఢిల్లీలో ఖట్టర్‌ను కలిశానన్న కేటీఆర్ వ్యాఖ్యలు అవాస్తవమన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
  • ఢిల్లీలో ఆయనకు బీజేపీ నేతలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న ఎంపీ
  • ఖట్టర్ ఆఫీస్ పీఏతో తాను మాట్లాడాకే ఈ విషయం చెబుతున్నానన్న బీజేపీ నేత
అమృత్ పథకంలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు తాను ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అయితే, అందులో ఏమాత్రం నిజం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఓ చానల్‌తో మాట్లాడుతూ కేంద్రమంత్రి ఖట్టర్‌ను కేటీఆర్ కలవలేదని, ఒకవేళ కలిసి ఉంటే ఫొటోలు విడుదల చేసి ఉండేవారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకోవడం నిజమేనని, కానీ కేటీఆర్‌ను బయటి నుంచే పంపించివేశారని తెలిపారు.

ఢిల్లీలో కేటీఆర్ ఒక్క బీజేపీ నాయకుడిని కూడా కలవలేదని కొండా పేర్కొన్నారు. ఎవరూ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఖట్టర్ ఆఫీస్ పీఏతో మాట్లాడిన తర్వాతే ఈ విషయాలు చెబుతున్నానని చెప్పారు. ఢిల్లీలో కేటీఆర్ కలిసింది కాంగ్రెస్ నాయకులనేనని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని ఉన్నప్పటికీ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అడ్డుకుంటోందని విశ్వేశ్వర్‌రెడ్డి వివరించారు. 
Konda Vishweshwar Reddy
BJP
KTR
BRS
Congress

More Telugu News