విమానంలో కుదుపులకు ఎగిరిపడ్డ ప్రయాణికులు.. వీడియో ఇదిగో!
- టర్బ్ లెన్స్ కారణంగా విపరీతమైన కుదుపులు
- సీట్లలో ఎగిరిపడ్డ ప్రయాణికులు.. చెల్లాచెదురుగా కిందపడ్డ వస్తువులు
- చచ్చిపోతామని భయపడ్డానన్న ప్యాసింజర్
- వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పిన పైలట్
ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీ లో దిగాల్సి ఉండగా.. మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. ప్రయాణికులు సీట్లలో ఎగిరిపడడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్ లో దింపేశాడు. ఆపై ప్రయాణికులకు రాత్రి వసతి కల్పించి, తెల్లవారి మరో విమానంలో మయామికి పంపించారు.