భారత క్రికెట్లో అన్షుల్ కాంభోజ్ అరుదైన ఘనత... వీడియో ఇదిగో!
- ఓ ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు ఒక్కడే పడగొట్టిన వైనం
- కేరళపై ఆడుతూ 10 వికెట్లు తీసిన హర్యానా పేసర్ అన్షుల్ కాంభోజ్
- రంజీ ట్రోఫీ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో బౌలర్ గా రికార్డు
హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ కేరళపై ఆడుతూ 49 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డు పుటల్లోకెక్కాడు.
అన్షుల్ కాంభోజ్ కంటే ముందు... 1956లో బెంగాల్ బౌలర్ ప్రేమాంగ్సు ఛటర్జీ 20 పరుగులిచ్చి 10 వికెట్లు తీయగా... 1985లో రాజస్థాన్-విదర్భ మ్యాచ్ లో ప్రదీప్ సుందరం 78 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.