Patnam Narendar Reddy: పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ పిటిషన్

Petition filed in HC special barack for Patnam Narendar Reddy
  • పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది
  • నేరస్థులతో కూడిన బ్యారక్‌లో ఉంచారని వెల్లడి
  • పిటిషన్‌ను పరిశీలించి తిరస్కరించిన హైకోర్టు రిజిస్ట్రీ
లగచర్ల ఘటనకు సంబంధించి అరెస్టైన పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 

నరేందర్ రెడ్డిని నేరస్థులతో కూడిన బ్యారక్‌లో ఉంచినట్లు అందులో పేర్కొన్నారు. ఆయనకు స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ... దానిని తిరస్కరించింది. కాగా, ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉండగా, తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో నిన్న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశముంది.
Patnam Narendar Reddy
District Collector
Telangana

More Telugu News