Siva temples: కార్తిక పౌర్ణమి శోభ .. భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు

heavy croud siva temples
  • సముద్ర, నదీతీరాల్లో పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
  • నదీతీరాల్లో దీపాలు వెలిగించి తెప్పలు వదిలిన మహిళలు
  • ఆలయాల్లో 365 ఒత్తులతో కార్తిక దీపాలు వెలిగించిన మహిళలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాలలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు దీపాలను వెలిగించి తెప్పలు వదిలారు.

సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం, మచిలీపట్నం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో మహిళలు 365 ఒత్తులతో కార్తిక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు.  
Siva temples
ap news
devotional

More Telugu News