Stock Market: వరుసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్ డౌన్

Indian stock markets downs staright sixth day
  • కొనసాగుతున్న భారత స్టాక్ మార్కెట్ కష్టాలు
  • ఇవాళ కూడా అమ్మకాల ఒత్తిళ్లు
  • 110 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్
  • నిఫ్టీలో కొనుగోళ్ల ట్రెండ్... కొద్దిమేర తగ్గిన నష్టాలు
భారత స్టాక్ మార్కెట్ కష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా మార్కెట్ కు నష్టాలు తప్పలేదు. అమ్మకాల ఒత్తిడి ఇవాళ కూడా కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాల్లో ఇన్వెసర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సూచీలపై ప్రభావం పడింది. 

సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 77,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,532 వద్ద స్థిరపడింది.  ఆటోమొబైల్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ, మీడియా, ప్రైవేటు బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్ల ట్రెండ్ కనిపించడంతో నిఫ్టీలో నష్టాల శాతం కొద్దిగా తగ్గింది.

కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలు అందుకోగా... హెచ్ యూఎల్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ నష్టపోయాయి.
Stock Market
Sensex
Nifty
India

More Telugu News