TTD: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల ఆభరణం.. మాజీ చైర్మన్ మనవరాలు విరాళం

TTD Former Chairman Grand Daughter Huge Gift To Tirumala Temple



తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణాభరణం విరాళంగా అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్, దివంగత నేత డీకే ఆదికేశవులనాయుడు మనవరాలు చైతన్య ఈ విరాళం అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా స్వర్ణ వైజయంతీ మాలను స్వామి వారికి చైతన్య సమర్పించారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు అలంకరించనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. 

కాగా, ఇలాంటిదే మరో స్వర్ణ వైజయంతీ మాలను తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారికి సమర్పించనున్నట్లు చైతన్య తెలిపారు. శుక్రవారం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని విరాళం అందజేయనున్నట్లు వివరించారు.
TTD
TTD Chairman
AdikeshavulaNaidu
2 crores
Gold ornament
Tirumala
Gift

More Telugu News