GV Anjaneyulu: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుకు క్యాబినెట్ హోదా

AP Govt allots cabinet status to Chief Whip GV Anjaneyulu
  • నిన్న అసెంబ్లీ, మండలికి చీఫ్ విప్ లు, విప్ లను ప్రకటించిన సర్కారు
  • అసెంబ్లీలో చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులు
  • విప్ లకు సహాయ మంత్రి హోదా
  • నేడు ఉత్తర్వులు జారీ
ఏపీ ప్రభుత్వం నిన్న అసెంబ్లీ, శాసనమండలికి సంబంధించి ఇద్దరు చీఫ్ విప్ లను, 18 మంది విప్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ చీఫ్ విప్ గా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును చీఫ్ విప్ గా నియమించింది. 

తాజాగా, జీవీ ఆంజనేయులుకు క్యాబినెట్ మంత్రి హోదా కల్పించారు. ఇతర విప్ లకు సహాయ మంత్రి హోదా కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, గత ప్రభుత్వంలో అసెంబ్లీ, మండలిలో చీఫ్ విప్ లు, విప్ ల సంఖ్య 9 కాగా... కూటమి ప్రభుత్వం ఆ సంఖ్యను 20కి పెంచింది. చీఫ్ విప్ తో కలిపి అసెంబ్లీలో మొత్తం 16 మంది... చీఫ్ విప్ తో కలిపి మండలిలో మొత్తం నలుగురు విప్ లను ప్రకటించింది.

నూతనంగా నియమితులైన చీఫ్ విప్ లు, విప్ లు నేడు ముఖ్యమంత్రిని చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 
GV Anjaneyulu
Chief Whip
Cabinet Rank
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News