Minister Narayana: విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై మంత్రి నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు

AP Minister Narayana Talk about Visakhapatnam Metro Rail Project in Assembly Session
  • రెండో రోజు కొన‌సాగుతున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు 
  • ప్ర‌శ్నోత్త‌రాల్లో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై స‌మాధానం చెప్పిన మంత్రి నారాయ‌ణ 
  • ఈ ప్రాజెక్టుపై స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్లు వెల్ల‌డి
  • కేంద్రం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
ఏపీ అసెంబ్లీ రెండో రోజు స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా మంత్రి నారాయ‌ణ విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై స‌మాధానం చెప్పారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు. 

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. మెట్రోరైల్ రాకుండా గ‌త ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా ప‌క్క‌న పెట్టేసింద‌ని మంత్రి విమ‌ర్శించారు. మెట్రో ప్రాజెక్టుపై స్వ‌యంగా కేంద్ర‌మంత్రిని క‌లిసిన‌ట్లు మంత్రి నారాయ‌ణ వెల్ల‌డించారు.  
Minister Narayana
t Visakhapatnam Metro Rail Project
AP Assembly Session
Andhra Pradesh

More Telugu News