America: అమెరికా అధ్యక్షుడు బైడెన్ కంటతడి.. వీడియో ఇదిగో!

President Biden teared up as he joined veterans day event
  • అమరులైన సైనికులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం
  • వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్
  • తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవం ఇదేనని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటతడి పెట్టాడు. సైన్యంలో సేవలందిస్తూ అమరులైన సోల్జర్లను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పాల్గొన్నారు. అమరుల సేవలను గుర్తు చేసుకుంటూ ‘గాడ్ బ్లెస్‌ అమెరికా’ పాట ఆలపిస్తూ బైడెన్ కంటతడి పెట్టడం, ఆ తర్వాత కన్నీళ్లను తుడుచుకోవడం వీడియోలో కనిపించింది.

అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. కమాండర్ ఇన్ చీఫ్ గా తాను ఇక్కడ నిలబడడం ఇదే చివరిసారని అన్నారు. జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవం ఇదేనని చెప్పారు. తన కుమారుడు బ్యూ బైడెన్ కూడా ఇరాక్ లో ఏడాది పాటు పనిచేశాడని చెప్పారు. కాగా, బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ 2015 లో గ్లియోబ్లాస్టోమా వ్యాధి కారణంగా చనిపోయాడు.
America
Joe Biden
veterans day
Biden Teared
Viral Videos

More Telugu News