Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ ధరించిన స్పోర్ట్ వాచ్ ఫొటోలు వైరల్.. ధరెంతో తెలిస్తే గుండె గుభేల్!

Team India bowler Siraj sports watch allegedly worth Rs 4 crore
  • ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటో వైరల్
  • రోలెక్స్ డేటోనా రెయిన్‌బో వాచ్ ధరించిన సిరాజ్
  • దాని విలువ దాదాపు రూ. 4 కోట్లు
  • ఇలాంటి మరెన్నో ఖరీదైన వాచీలు సిరాజ్ సొంతం
హైదరాబాద్‌కు చెందిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు. అయితే, ఇది మైదానంలో అతడి ప్రదర్శనకు సంబంధించి కాదు.. అతడి ఖరీదైన లైఫ్‌స్టయిల్‌కు సంబంధించినది. సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హైఎండ్ లైఫ్‌స్టయిల్‌కు సంబంధించిన ఫొటోలు దర్శనమిస్తూ ఉంటాయి. నగరంలోని అతడి ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంటుంది.

తాజాగా సిరాజ్ షేర్ చేసిన ఫొటోలో ఖరీదైన అర్మానీ షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించి కనిపించాడు. ఈ ఫొటోలో అతడి చేతికి ఉన్న వాచీ అభిమానులను ఆకర్షించింది. ఇది రోలెక్స్ డేటోనా రెయిన్‌బో వాచ్. దీని ఖరీదు 3 నుంచి 4 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఇటీవల బిగ్‌బాస్ 18 షూట్‌లో ఇలాంటి వాచీనే ధరించి కనిపించాడు.

సిరాజ్‌ దగ్గర ఇదొక్కటే కాదు.. హై ఎండ్ రోలెక్స్ వాచీలు మరెన్నో ఉన్నాయి. వీటిలో కోటి రూపాయల విలువైన రోలెక్స్ డేటోనా ప్లాటినమ్, రూ. 19.17 లక్షల విలువైన రోలెక్స్ జీఎంటీ మాస్టర్ వంటివి ఉన్నాయి. దీనిని బట్టి సిరాజ్ రోలెక్స్ ఫ్యాన్ అని అర్థమవుతుంది.

కాగా, ఐపీఎల్‌లో 2018 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సిరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆర్సీబీ అతడిని వదిలించుకుంది. కొన్ని సంవత్సరాలుగా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఆర్సీబీ వదిలించుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.
Mohammed Siraj
Team India
Rolex Daytona Rainbow
Crime News

More Telugu News