Maharashtra Elections: మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. ఎప్పుడంటే..!

AP Dy CM Pawan Kalyan In Maharashtra Election Campaign for NDA
  • ఎన్డీయే కూటమి కోసం ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం
  • బీజేపీ కూటమిని గెలిపించాలని మహారాష్ట్ర ఓటర్లను కోరనున్న పవన్
  • తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో ప్రచారం
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 20న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో బీజేపీ కోసం ప్రచారం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమిలో భాగమైన జనసేన.. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి సహకరించనుంది. రెండు రోజుల పాటు ప్రచారం చేసేందుకు పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Maharashtra Elections
Jansena
Pawan Kalyan
AP Deputy CM
NDA
BJP

More Telugu News