Viral News: ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళ్లిన మహిళకు రూ.2.10 కోట్లు

US Woman Wins 250000 dollars Lottery Prize when she went for Orange Juice
  • జ్యూస్ తాగుతుండగా దృష్టిని ఆకర్షించిన లాటరీ టికెట్లు
  • 20 డాలర్లు పెట్టి ఒక టికెట్ కొన్న మహిళ
  • 2,50,000 డాలర్ల ప్రైజ్ మనీ విన్నర్‌గా నిలిచిన వైనం
ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళితే అదృష్టం కలిసి వస్తుందని ఎవరు ఊహిస్తారు! కానీ అమెరికాకు చెందిన ఓ మహిళకు కలలో కూడా ఊహించనంత డబ్బు దక్కింది. నార్త్ కరోలినాలోని కెర్నర్స్‌విల్లేకు చెందిన కెల్లీ స్పార్ అనే మహిళ ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ‘క్వాలిటీ మార్ట్‌’ అనే దుకాణానికి వెళ్లింది. జ్యూస్ తాగుతుండగా అక్కడే ఉన్న గ్యాస్ స్టేషన్‌లోని లాటరీ టికెట్లపై ఆమె దృష్టి పడింది. వెంటనే తాగడం ఆపి వెళ్లి 20 డాలర్లతో ఒక టికెట్‌ను కొనుగోలు చేసింది. టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా ‘టాప్ ప్రైజ్ విన్నర్’ అని ఉంది. దీంతో ఆమె 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

‘‘గ్యాస్ స్టేషన్ వద్ద కొత్త లాటరీ టిక్కెట్లు ఉన్నాయని గమనించాను. ఒక టికెట్ కొనుగోలు చేయాలని అనుకున్నాను. కింది భాగంలో మడత ఉన్న టికెట్ నా దృష్టిని ఆకర్షించింది. కొనుగోలు చేశాను’’ అని కెల్లి స్పార్ పేర్కొంది. ఈ డబ్బు తమ కుటుంబ స్వరూపాన్ని మార్చుతుందని, చాలా ఉపయోగపడుతుందని ఆమె హర్షం వ్యక్తం చేసింది. జీవితాలను మార్చివేసే డబ్బు అని, కొత్త అవకాశాలను దగ్గర చేస్తుందని ఆమె పేర్కొంది.

కెల్లీ స్పార్ మాదిరిగానే ఇటీవల ఓ సాధారణ ఉద్యోగికి ఏకంగా 3 మిలియన్ డాలర్ల (రూ.25.24 కోట్ల) లాటరీ తగిలింది. లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న అతడికి భార్య ఫోన్ చేసి చెప్పడంతో... తిరిగి ఇంటికి వెళ్తే ఆలస్యమవుతుందేమోనని మార్గమధ్యంలో ఒక దుకాణానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. దీంతో అతడి తలరాత మారిపోయింది.
Viral News
Trending News
Off beat News
USA

More Telugu News