Revanth Reddy: రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్

KTR to go Delhi tomorrow to complaint on Revanth Reddy
  • రేపు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్న కేటీఆర్
  • అమృత్ టెండర్లలో సీఎం దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేయనున్న కేటీఆర్
  • బావమరిదికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఆయన కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్నారు. అమృత్ టెండర్ల విషయంలో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు.

అమృత్ పథకం టెండర్లలో ముఖ్యమంత్రి తన బావమరిది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే కేంద్రమంత్రికి ఈ విషయమై లేఖ రాశారు. ఇప్పుడు నేరుగా కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్ రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు.
Revanth Reddy
KTR
Telangana
BRS

More Telugu News