రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
- 2024–25 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
- మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్
- వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు.