రోప్ వేలో శ్రీశైలం ఆలయం వద్దకు సీఎం చంద్రబాబు... మల్లన్న దర్శనం
- విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ లో చేరుకున్న చంద్రబాబు
- శ్రీశైలం ఆలయంలో చంద్రబాబుకు పూర్ణకుంభ స్వాగతం
- ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికాయి. చంద్రబాబు ఇక్కడి భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చంద్రబాబుకు వేదాశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు సీఎంకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు పంచెకట్టులో ప్రత్యేకంగా కనిపించారు.
