Pawan Kalyan: పవన్ కొత్త చిత్రంపై నిర్మాత కీలక వ్యాఖ్యలు

Producer Ram Talluri Talk about Pawan Kalyan and Surender Reddy Combo
  • గ‌తంలో ప‌వ‌న్, సురేంద‌ర్ రెడ్డి కాంబోలో మూవీపై ప్ర‌క‌ట‌న‌
  • ఆ త‌ర్వాత ఆ మూవీ గురించి ఉసేలేకుండా పోయిన వైనం
  • ఈ ప్రాజెక్టు విష‌య‌మై తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి వివ‌ర‌ణ‌
గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్, సురేంద‌ర్ రెడ్డి కాంబోలో ఒక సినిమా గురించి ప్ర‌క‌ట‌న వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే, అది ప్ర‌క‌ట‌న‌కే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత ఈ మూవీ గురించి ఉసేలేకుండా పోయింది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీ కావ‌డంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ విష‌య‌మై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి స్పందించారు. 

  "ప‌వ‌ర్ స్టార్ కోసం సురేంద‌ర్ రెడ్డి రేసుగుర్రం, కిక్ సినిమాల మాదిరిగా మంచి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ను సిద్ధం చేశారు. స్క్రిప్ట్ కూడా రెడీనే. ఎప్పుడో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీగా కావ‌డం, సురేంద‌ర్ రెడ్డి మ‌ధ్య‌లో అఖిల్‌తో ఏజెంట్ మూవీ తెర‌కెక్కిండం వ‌ల‌ల్ ఆల‌స్య‌మైంది. 

ప్ర‌స్తుతానికి వెంట‌నే సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశ‌మైతే లేదు. ఎందుకంటే ప‌వ‌న్ ఒక‌వైపు రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటూనే, మ‌రోవైపు తాను అంగీక‌రించిన చిత్రాల షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అవ‌న్నీ పూర్తి కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది" అని ఆయన చెప్పుకొచ్చారు. 

మ‌రోవైపు సురేంద‌ర్ రెడ్డి మ‌రో కొత్త‌ క‌థ‌ను సిద్ధం చేశార‌ని, త్వ‌ర‌లోనే ఆ స్టోరీని ఓ పెద్ద హీరోకు వినిపించేందుకు రెడీ అవుతున్నామ‌ని రామ్ తాళ్లూరి చెప్పారు.  
Pawan Kalyan
Surender Reddy
Ram Talluri
Tollywood

More Telugu News