Virat Kohli: ముంబ‌యి రెస్టారెంట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ కోహ్లీ-అనుష్క.. నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

Virat Kohli and Anushka Sharma Enjoy Breakfast In Benne Bombay
  • తన విరామ స‌మ‌యాన్ని ఫ్యామిలీతో గడుపుతున్న కోహ్లీ
  • ప్రస్తుతం ముంబయిలో ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్న వైనం
  • ఈ క్ర‌మంలో బెన్నె బాంబే రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన కోహ్లీ దంప‌తులు
  • ఆ స‌మ‌యంలో దిగిన ఫొటోల‌ను పంచుకున్న రెస్టారెంట్‌
కుమారుడు అకాయ్ పుట్టిన త‌ర్వాత నుంచి టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్‌ కోహ్లీ లండ‌న్‌లో సెటిల్ అయిన విష‌యం తెలిసిందే. భార‌త జ‌ట్టు స్వ‌దేశంలో లేదా విదేశాల్లో ఎక్క‌డ సిరీస్ ఆడినా.. అది ముగిసిన వెంట‌నే లండ‌న్ ఫ్లైట్‌ ఎక్కేసేవాడు. కానీ, స్వ‌దేశంలో కివీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత కోహ్లీ మ‌న‌సు మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. లండ‌న్ వెళ్లలేదు. ఫ్యామిలీతో క‌లిసి ఇండియాలోనే ఉండిపోయాడు. 

ఈనెల 5న త‌న పుట్టిన‌రోజును కూడా ఇక్క‌డే జ‌రుపుకున్నాడు. తన విరామ సమయాన్ని ఫ్యామిలీతో గ‌డుపుతున్నాడు. ప్రస్తుతం ముంబయిలో ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్నాడు. భార్య అనుష్క శర్మ కుమారుడు అకాయ్‌, కుమార్తె వామిక‌తో కలిసి సరదాగా గడుపుతున్నాడు.

తాజాగా ఈ దంప‌తులు ముంబయిలోని ఫేమస్‌ సౌత్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ బెన్నె బాంబేలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అక్క‌డ‌ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌ సిబ్బందితో ఇద్దరూ స‌ర‌దాగా ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సదరు రెస్టారెంట్ త‌న‌ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పంచుకుంది. దాంతో ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.
Virat Kohli
Anushka Sharma
Benne Bombay
Mumbai

More Telugu News