borugadda anil: బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం... పోలీసులపై వేటు!

ap police shows respect to ysrcp leader borugadda anil video viral
  • రెస్టారెంట్‌లో రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ ‌కు విందు భోజనం
  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
  • ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిన ఎస్పీ
రిమాండ్ ఖైదీకి రెస్టారెంట్‌లో విందు భోజనం చేసేందుకు అవకాశం కల్పించిన పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. ఏకంగా ఏడుగురు పోలీసులను గుంటూరు జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. 

ఓ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో హజరు పర్చి తిరిగి తీసుకువెళుతుండగా, మార్గమధ్యంలో గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద అగి భోజనాలు చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు సెల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా, పోలీసులు వాళ్ల ఫోన్‌ లాక్కుని వీడియో డిలీట్ చేశారు.

అయినా రెస్టారెంట్‌లోని సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితుడు బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల విందు భోజనం అంటూ సోషల్ మీడియాలో వీడియో హల్ చల్ చేయడంతో పోలీసు అధికారులు స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏడుగురు పోలీసులపై ఎస్పీ సతీశ్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. 
borugadda anil
Social Media
video viral
YSRCP
AP Police

More Telugu News