Chandrababu: సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టు... వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి అరెస్ట్

Police arrest Venkatrami Reddy who morphed Chandrababu image
  • చంద్రబాబు ఫొటో మార్ఫింగ్
  • ఫేస్ బుక్ లో పోస్టు
  • వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు 
ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ స్పందించారు. చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పెట్టారని వెల్లడించారు. 

ఈ మేరకు వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని వివరించారు. అతడిని కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిందని డీఎస్పీ వెల్లడించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Chandrababu
Morphed Image
Venkatrami Reddy
Guntur

More Telugu News